Header Banner

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! UPSC- 2026 క్యాలెండర్ విడుదల! ఏ ఎగ్జామ్ ఎప్పుడో చెక్ చేసుకోండి!

  Thu May 15, 2025 21:17        Employment

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 కు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొంది. సివిల్స్, సీడీఎస్, ఐఈఎస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఈ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పరీక్షల కోసం యూపీఎస్సీ ఏటా క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఈ క్యాలెండర్ కు అనుగుణంగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతారు.



నిరుద్యోగులు ఏటా ఎదురుచూసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 సంబంధించిన క్యాలెండర్ విడుదల అయింది. ఈ క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 24న నిర్వహించనుంది కమిషన్. ఇక మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు తేదీలను కమిషన్ ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు కమిషన్ అధికారిక నోటిఫికేషన్‌ను జనవరి 14న విడుదల చేయనున్నట్లు క్యాలెండర్ లో పేర్కొంది. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం అభ్యర్థులు ఈ క్యాలెండర్ ను ఇప్పుడే చూసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి.



UPSC Exam Calendar 2026 Released Check Full Schedule Here

యూపీఎస్సీ 2026 క్యాలెండర్ ప్రకారం.. ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నావల్ అకాడమీ(UPSC NDA/NA).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS1) పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ,అప్లికేషన్ ఫామ్ డిసెంబర్ 10న విడుదల చేయనుంది కమిషన్. అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షల సెకండ్ స్టేజ్ సెప్టెంబర్ 13, 2026న నిర్వహించనున్నట్లు పేర్కొంది.

UPSC Exam Calendar 2026 Released Check Full Schedule Here

అలాగే యూపీఎస్సీకి సంబంధించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) పరీక్ష తేదీని కూడా ప్రకటించింది కమిషన్. జూలై 19, 2026న పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది.


ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPSC2026 #UPSCCalendar #JobAlert #GoodNews #GovernmentJobs #UPSCExams #UPSCUpdates